4 March, 2026 | 12:01 PM

గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌లో రికార్డు

04-03-2026 01:00 AM

18139 మెగావాట్లు !

గతేడాది 17162 మెగావాట్ల రికార్డును దాటిన విద్యుత్ సంస్థ

ఏడాదికి 1000 నుంచి 1500 మెగావాట్ల వరకు గరిష్ఠ డిమాండ్‌లో పెరుగుదల

విద్యుత్తు రంగ అధికారులు, సిబ్బందికి డిప్యూటీ సీఎం భట్టి అభినందనలు 

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌లో మ రో కొత్త రికార్డు చేరింది. మంగళవారం ఉద యం 11.01 గటలకు 18139 మెగావాట్ల గరి ష్ఠ డిమాడ్  నమోదయ్యింది. దీంతో ఇప్పటి వరకు ఇటు తెలంగాణలో, ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనంత విద్యుత్తు డిమాండ్ నమోదైనట్టుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు.

18139 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైనా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేశామ ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆటంకాలు లేకుండా.. నాణ్యతతో కూడిన విద్యుతుత సరఫరా చేసిన విద్యుత్తు రంగంలోని ఉన్నతాధికారులు, సిబ్బందికి డిప్యూటీ సీఎం భట్టి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుద ల చేస్తూ..

ఈ మైలురాయి తెలంగాణ ఆర్థిక వృద్ధి, కార్యనిర్వహణ సామర్థ్యం, అద్భుత సమన్వయానికి నిదర్శనం అని పేర్కొన్నారు. భౌగోళికంగా చిన్న రాష్ట్రం అయినప్పటికీ.. పెద్ద రాష్ట్రాల గరిష్ఠ డిమాండ్‌ను అధిగమిం చే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. ఈ ప్రగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధిలో మన వేగాన్ని స్పష్టం చేస్తుందని పేరొన్నారు. 

అంచెలంచెలుగా..

అభివృద్ధికి కొలమానంగా చెప్పుకునే విద్యు త్తు విషయంలో తెలంగాణ రాష్ట్రంలో గరిష్ఠ డిమాండ్ అంచెలంచెలుగా పెరుగు తూ వస్తోంది. 2023 15623 మెగావాట్లు (8.3.2024) కాగా.. 2024 17162 మె గావాట్లు (20.3.2025), తాజాగా (2025 26) 18139 మెగావాట్ల (3.3. 2026) గరిష్ఠ డిమాండ్  రావడం గమనా ర్హం. అంటే సంవత్సరానికి 1000 మెగావా ట్ల నుంచి 1500 మెగావాట్ల వరకు గరిష్ఠ డిమాండ్ పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు.

జాతీయ స్థాయిలో తెలంగాణ గరిష్ఠ డిమాండ్..

తెలంగాణలో 18139 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ రాగా.. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు 19900 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్, అలాగే రాజస్థాన్‌లో 19600 నుంచి 20600 మెగావాట్ల మధ్యలో గరిష్ఠ డిమాండ్ నమోదవ్వడంతో.. పెద్ద రాష్ట్రాల సరసన తెలంగాణ నిలిచిందని తెలిపారు.

పంజాబ్, హరియాణా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ లాంటి పారిశ్రామిక రాష్ట్రాల కంటే ఎక్కువ డిమాండ్ తెలంగాణలో నమోదు చేసి తన సామర్థ్యాన్ని చాటిందని డిప్యూటీ సీఎం హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అవసరాలు తీర్చడమేకాకుండా.. రాబోయే వేసవి గరిష్ఠ డిమాండ్‌కు ముందస్తు ప్రణాళితో పూర్తి సిద్ధంగా ఉందని, బలమైన గ్రిడ్ వ్యవస్థ, ముందుచూపు ప్రణాళిక, సమన్వయంతో ఉన్న వ్యవస్థ మన బలమని పేర్కొన్నారు.