అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
16-03-2026 11:30 AM
హైదరాబాద్: వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాడిపత్రి రాకేష్ (40) ఆదివారం సాయంత్రం అమెరికాలో గుండెపోటుతో మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులకు యుఎస్ నుంచి సమాచారం అందింది. రాకేష్(Warangal man) ఉద్యోగ నిమిత్తం తన కుటుంబంతో కలిసి గత పదేళ్లుగా అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో నివసిస్తున్నాడు. అతను 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాకేష్ తండ్రి జితేందర్ వరంగల్ లో వ్యాపారవేత్తగా ఉన్నారు. రాకేష్ ఆకస్మిక మరణ వార్త అతని కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.




