ముందుకు సాగని రోడ్డు పనులు, పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
చేగుంట జూలై 4,విజయక్రాంతి: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వాలు రోడ్డు, రవాణా సౌకర్యం మెరుగుపర్చడానికి ప్రభుత్వం రూ.కోట్లు వేచిస్తుంది.కానీ చేగుంట, దౌల్తాబాద్, రెండు మండల ప్రజలకు రోడ్డు నిర్మాణాలకు పలు గ్రామాలకు రహదారి సౌకర్యం కలగానే మిగిలింది. సరియొన రోడ్డుసౌకర్యం లేక, కన్యారం, రాంపూర్, గొల్ల పల్లి, జైత్రం తండా ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. వర్షాకాలంలో అయితే వారి కష్టాలు వర్ణనా తీతం.చేగుంట, దౌల్తాబాద్ రెండు మండలలా గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణానికి 2022 సంవత్సరంలో, కొన్ని వెల కోట్ల రూపాయలు మంజూరు చేసింది.
ప్రారంభంలో పనులు చేపట్టినా, తరచూ బ్రిడ్జి నిర్మాణలు అడ్డు తగలడంతో, వాటిని కొన్ని సంవత్సరాల వరకు పూర్తి చేయలేదు, అవి ఇప్పుడు పూర్తి నిర్మాణం చేపట్టిన,రోడ్డుపై మట్టి పోసి వదిలేశారు. అయితే రెండేళ్లుగా రోడ్డు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. గత నేల లో పనులను ప్రారంభించిన, అట్టి పనులు ఇప్పటికీ వరకు రోడ్డు నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టని కాకరణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలలో ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు తలెత్తితే ఇక వారు ప్రాణాలను మన చేతిలో పెట్టుకోవాల్సిందే, ఇప్పటికైనా అధికారులు, ప్రజ ప్రతినిధులు, స్పందించి, వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజల కోరుకుంటున్నారు.






