బీసీ హాస్టల్ లో మరమ్మతులు చేపట్టండి
04-07-2026 10:41 AM
బోథ్, జులై 4 (విజయక్రాంతి): మండలంలోని కౌట (బి) గ్రామంలో ఉన్న వెనుకబడిన బాలుర వసతి గృహంలో వివిధ గదుల పైకప్పు స్లాబ్ ప పెచ్చలు ఊడి పోవడంతో వర్షం కురిసిన సమయంలో నీటి చుక్కలు రాలుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. వర్షం కురిసిన రోజుల్లో విద్యార్థులు పడుకునేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏడాదికాలంగా మరమ్మతులు చేపట్టకపోవడంతో హాస్టల్లో ఉండే విద్యార్థులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి సకాలంలో మరమ్మతులు చేపట్టాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు






