4 July, 2026 | 12:05 PM

నాలుగు రకాల చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన సదస్సు

04-07-2026 10:49 AM

చేగుంట జూలై 04,విజయాక్రాంతి:  చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో  శుక్రవారం ఉపసర్పంచ్ స్వామి, సెక్రటరీ సునంద రాజ్ అధ్యక్షతన నాలుగు రకాల చెత్త సేకరణ పై మహిళలకు, గ్రామస్థులకు  అవగాహనా సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సెక్రటరీ  సునంద మాట్లాడుతూ జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు జులై 1 నుండి ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలోనే, చెత్తను వేరు చేసి  తడి,పొడి, హానికరా, వేస్ట్, రకాల చెత్తను వేరువేరుగా, గ్రామ సిబ్బంది అందజేయాలని సూచించారు అలా వేరు చేయని వారి నుండి ఎలాంటి చెత్త సేకరించబోమని పేర్కొన్నారు ,  ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్వామి, సెక్రటరీ సునంద, గ్రామస్థులు పాల్గొన్నారు.