వేతన పెంపు హర్షణీయం: కాంగ్రెస్
22-05-2026 12:57 PM
పాపన్నపేట,మే22: రాష్ట్రంలోని 1.11 కోట్ల మందికి పైగా కార్మికులకు మేలు జరిగేలా వేతనాల పెంపు నిర్ణయం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం పాపన్నపేట మండల కేంద్రం లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చిత్రపటాలకు కార్మికులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి మండలాధ్యక్షుడు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు వెంకటేశం, ఆయా గ్రామాల సర్పంచులు శ్రీధర్, శ్రీశైలం, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






