22 May, 2026 | 2:32 PM

ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: ఎంపీడీఓ

22-05-2026 01:13 PM

 తాండూరు ,మే 22,(విజయక్రాంతి):  వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తండా ఊర చెరువులో "జల సంచాయ్ - జన్ భాగిదారి'' కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను(Employment Guarantee Works) ఎంపీడీవో తిరుమల స్వామి, సర్పంచ్ ఆనంద్ నాయక్ తో  కలిసి పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా నిర్వహించాలని టెక్నికల్ అసిస్టెంట్ విజయ్, గ్రామ కార్యదర్శి నవిత ,ఫీల్డ్అసిస్టెంట్ ఆంజనేయులు లకు సూచించారు. పనిస్థలంలో తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నిరక్షరాస్య కూలీలు ''ఉల్లాస్'' కార్యక్రమం ద్వారా చదువు నేర్చుకోవాలని అన్నారు.