మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు ప్రారంభం
ఉట్నూర్, మే 22 (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో రబ్బీ జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ ముకాడే ఉత్తం ప్రారంభించారు. గురువారం యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రబ్బి సీజన్లో రైతులు పండించిన జొన్న పంటలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకే కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
మార్కెట్ యార్డ్ పరిధిలోని నార్నూర్ సబ్ యార్డు తో పాటు గాదిగూడ, తడిహత్నూర్ లలో నీ కేంద్రాల్లో రైతులు తీసుకువచ్చే జొన్నల కొనుగోలు చేస్తామని అన్నారు. రైతుల పేరుతో మధ్య దళారులు జొన్న పంటను తీసుకువస్తే వాటిని కొనుగోలు చేయడం కుదరదని అన్నారు. ఆయనతోపాటు పిఎసిఎస్ చైర్మన్ మారుతి డోంగ్రే, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రాథోడ్, కాంగ్రెస్ నాయకులు, పాల్గొన్నారు.






