నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
- ధాన్యం కాలిపోయిన సంఘటన బాధాకరం
- రైతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది..
- ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి, మే 22(విజయక్రాంతి): పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి గాంధీనగర్ లో ప్రమాదవశాత్తు ధాన్యం, కొంత పంట పొలం దగ్ధమైన సందర్భంగా నష్టపోయిన తోట రామకృష్ణ, తోట రాకేష్ రైతుల వరి ధాన్యం కుప్పలను ఘటన స్థలాన్ని పరిశీలించి తన వంతు బాధితులకు కొంత నగదు సహాయం అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ఈ సందర్బంగా విజయరమణ రావు మాట్లాడుతూ.. చందపల్లి గాంధీనగర్ లో రైతు సోదరులైన తోట రాకేష్ కొంత వరి ధాన్యం, రామకృష్ణ రైతుకు సంబంధించిన కొంత పంట పొలం దగ్ధం అవడం బాధాకరమని, ఆ ఇద్దరి రైతులను ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని, వరి ధాన్యం కాలిపోయిన రైతు సోదరులు అధైర్య పడవద్దని నష్టపరిహారం సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉందని ప్రతీ ధాన్యం గింజ కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటున్నదని గుర్తు చేశారు. గాంధీనగర్ లో నష్టపోయిన రైతులకు అండగా నిలిచి వారికి తోడుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






