22 May, 2026 | 1:53 PM

ప్రమాదాల నివారణకు కోనరావుపేట పోలీసుల ప్రత్యేక చర్యలు

22-05-2026 12:58 PM

ప్రమాదకర మలుపులో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

కోనరావుపేట, మే 22 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ పరిధిలోని ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో కోనరావుపేట పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనదారులను అప్రమత్తం చేసే ఉద్దేశంతో శుక్రవారం అక్కడ సూచిక బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు చందుర్తి సర్కిల్ సి.ఐ రవీందర్ తెలిపారు.

గతంలో ఈ ప్రాంతంలో పలు ప్రమాదాలు, ప్రాణనష్టం ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్న ఆయన, వాహనదారులు మలుపు ప్రాంతంలో నెమ్మదిగా ప్రయాణిస్తూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అవసరమైన జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్‌.ఐ ప్రశాంత్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.