22 May, 2026 | 2:33 PM

జంతు సంరక్షణ, జనన నియంత్రణ కేంద్రం ప్రారంభోత్సవం

22-05-2026 01:36 PM

ముకరంపుర, మే 22(విజయ క్రాంతి): నగర ప్రజల రక్షణ జంతువుల సంరక్షణే ధ్యేయంగా కరీంనగర్ నగర పాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జంతు సంరక్షణ మరియు జనన నియంత్రణ కేంద్రం  ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ ,బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్  యాదగిరి సునీల్ రావు , మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ లు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. నగరంలో జంతువుల జనాభాను అదుపు చేయడం, వాటికి సరైన వైద్య సదుపాయాలు అందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, మున్సిపల్ ఉన్నతాధికారులు, నగరపాలక సంస్థ సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.