22 May, 2026 | 1:52 PM

భూ సమస్యల పరిష్కారానికి పదిరోజులే గడువు.!

22-05-2026 12:56 PM

ఆ తరువాత పూర్తి అయ్యేంత వరకూ విశ్రమించేది లేదు. 

అయినా పరిష్కారం చూపని అధికారులపై చర్యలు: మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలోని రైతుల భూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను(Land Issues) పదిరోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారి వరకు వారి వారి స్థాయిలోని పెండింగ్ ఫైల్స్ వెంటనే పూర్తి చేయాలని పది రోజుల్లో పూర్తి చేయని వాటిని పూర్తి చేసేంత వరకూ రాత్రింబవళ్ళు పని చేసైనా పూర్తి చేయాల్సిందేనన్నారు.

గడువు అనంతరం కూడా సమస్యలు కొనసాగితే పూర్తి అయ్యేంతవరకు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను రోజుల తరబడి కార్యాలయానికి తిప్పుకోవడం సరి కాదన్నారు. ఆదాయం పైన దృష్టి సారించడం కాకుండా ప్రజలకు సేవ చేవా చేసామన్నా ఆత్మ సంతృప్తి పొందాలని అధికారులకు చురకలు అంటించారు. ప్రజలకు సేవ చేసినప్పుడే ప్రజా పాలనకు సార్ధకత లభిస్తుందాన్నారు.