11-02-2026 07:05:34 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మల్ జిల్లాలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో పెద్ద ఎత్తున యువకులు, వృద్ధులు సామాజిక కార్యకర్తలు అధికారులు తమ ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకుని సెల్ఫీ విత్ ఫోటో సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఓటుకున్న విలువను తెలుపుతూ మీ మోటేశం మీరు ఓటు వేయండి అంటూ విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు సోషల్ మీడియాలో మొత్తం కుటుంబ కుటుంబ సభ్యులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ ఓటు హక్కు వినియోగించుకుని ఓటుకున్న విలువను సమాజానికి తెలిపారు.