calender_icon.png 11 February, 2026 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుక్కాపూర్‌లో తొలి గ్రామ సభ

11-02-2026 07:11:06 PM

సర్పంచ్ దొడ్లె ఆంజనేయులు

కొల్చారం,(విజయక్రాంతి): నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం ఏర్పడిన అనంతరం తుక్కాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం తొలి గ్రామసభను సర్పంచ్ దొడ్లె ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ గ్రామసభలో ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా పలు కీలక అంశాలను చర్చించి, వాటి పరిష్కారానికి అవసరమైన తీర్మానాలను ఆమోదించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనుల మెరుగుదల, నూతన సీసీ రోడ్ల ఏర్పాటు ప్రతిపాదనలు, త్రాగునీటి సౌకర్యం తదితర అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.

అనంతరం గ్రామ సమావేశ మందిరంలో గ్రామ ప్రజలు, పెద్దల సమక్షంలో గ్రామసభలో చర్చించిన అంశాలను వివరించి, గ్రామ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఉపసర్పంచ్ రవీందర్, వార్డు సభ్యులు దొడ్ల చంద్రకళ రాజప్ప, సుధాకర్, అంజయ్య మమతా శ్రీనివాస్, గంగయ్య, నవీన్ కుమార్ సంగీత, గ్రామ పెద్దలు దత్తురావు, సిద్దప్ప మల్లప్ప, మంగళ కృష్ణ మంగలి పండరి శివాజీ, దిగంబర్, సీకయ్య, ఎలుక చంద్రయ్య, రామకృష్ణయ్య, విష్ణువర్ధన్, మంగళి నరసింహులు, ఆయిలి శేఖర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.