13 June, 2026 | 6:58 PM

Breaking News

క్రీడలు మానసిక... శారీరక వికాసానికి హేతువులు

13-06-2026 05:54 PM

బిఆర్ఎస్ యువ నాయకుడు దిలీప్

జవహర్ నగర్,(విజయక్రాంతి): క్రీడలు మానసిక శారీరక వికాసానికి హేతువులని యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు వారికి అవసరమైన ప్రోత్సాహం సహకారం అందించాలని బిఆర్ఎస్ యువనాయకుడు దిలీప్ పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ శాంతినగర్ లో యువత క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు శాంతినగర్ యువతకు వాలీబాల్ కిట్ ను శనివారం  బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా యువ నాయకుడు దిలీప్ మాట్లాడుతూ... యువత క్రీడల ద్వారా శారీరకంగా దృఢంగా మానసికంగా ఉత్సాహంగా ఎదగాలని ఆకాంక్షించారు.

యువత మానసిక అభివృద్ధితోపాటు శారీరక అభివృద్ధికి మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని మనిషి సర్వతో ముఖాభివృద్ధికి క్రీడలు ఎంతో అవసరం అన్నారు. యువతను ప్రోత్సహించడానికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు వారికి అవసరమైన ప్రోత్సాహం సహకారం అందించడంలో తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.