13 June, 2026 | 7:02 PM

Breaking News

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి

13-06-2026 05:50 PM

- దాతర్‌పల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు వడ్ల సుగుణమ్మ వేడుకోలు 

గజ్వేల్: గజ్వేల్ మండలం దాతర్‌పల్లి గ్రామానికి చెందిన వడ్ల సుగుణమ్మ (65) తనకు రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆమె భర్త లక్ష్మయ్య మృతి చెందగా, ప్రస్తుతం ఒంటరిగా జీవనం సాగిస్తుంది.  గత 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా తన ఇంటి పైకప్పు కూలిపోయిందని, తనకు ఎలాంటి ఆస్తి, పాస్తులు లేకపోవడంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం నివాసానికి సరైన ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ప్రభుత్వం తన పరిస్థితిని పరిశీలించి, ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని వడ్ల సుగుణమ్మ కోరుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది.