28 August, 2026 | 5:18 AM

అధికారులకు రాఖీ కట్టిన వీఓఏ

28-08-2026 02:43 AM

అబ్దుల్లాపూర్ మెట్, ఆగస్టు ౨౭: మల్కాజిగిరి కమిషనర్ బి సుమతి(Malkajgiri Commissioner B. Sumathi) ఆదేశాల మేరకు  కమిషనరేట్ పరిధి ఎల్బీనగర్ డివిజన్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధి అబ్దుల్లాపూర్ గ్రామ పోలీస్ సహచరి,  (వీఓఏ)  జీ మహేశ్వరి ఇంటికి ఇబ్రహీంపట్నం  ఆర్డీవో  శ్రీనివాస్ రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, హయత్ నగర్ డీఐ సంతోష్ కుమార్, అబ్దుల్లాపూర్ మెట్ సబ్ ఇన్ స్పెక్టర్ లు గురువారం వెళ్లి వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రక్షాబంధన్ సందర్భంగా అధికారులకు పోలీస్ సహచరి (వీఓఏ) మహేశ్వరి  రాఖీ కట్టింది.