calender_icon.png 18 February, 2026 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలసీతలీకరణ కేంద్రం సందర్శన

18-02-2026 07:43:51 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్‌లోని ప్రభుత్వ స్నాతక కళాశాల రసాయన శాస్త్ర విభాగం విద్యార్థులు, అధ్యాపకులు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సుధాకర్ అధ్యాపకులు బుధవారం పాలసీతలీకరణ కేంద్రం సందర్శించారు. విజయ డైరీ అధికారులు, సిబ్బంది, శ్రీ సాయిలుతో కలిసి పాల నాణ్యత పరీక్షా విధానాలపై వివరణాత్మక ప్రదర్శనను అడిగి తెలుసుకున్నారు. పాలలో కల్తీని గుర్తించడానికి, పాల స్వచ్ఛతను అంచనా వేయడానికి పాశ్చరైజేషన్, పరిశుభ్రమైన ప్యాకేజింగ్ ప్రక్రియలను వారు వివరించారు. ఈ కార్యక్రమంలో రసాయన శాస్త్ర అధ్యాపకులు కె. సూర్యసాగర్, జి. అర్చన,  సనా గజాలా, విద్యార్థులు  పాల్గొన్నారు.