5 August, 2026 | 1:41 AM

అమనగల్‌లో పోలీసుల విజిబుల్ పోలీసింగ్

05-08-2026 12:41 AM

వాహనాల తనిఖీలు

అమనగల్లు, ఆగస్టు 4 (విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని అమనగల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంగళవారం షాద్నగర్ రోడ్డులో విజిబుల్ పోలీసింగ్ మరియు వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 25 మంది వాహనదారులపై ఈ-చలాన్లు నమోదు చేశారు.

అలాగే 12 పెండింగ్ చలాన్లను పరిష్కరించి రూ. 3,200 జరిమానా వసూలు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ ఐ సంతోష్ రెడ్డి మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొని వాహనదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా వాహనాలు నడపాలని వారు సూచించారు.