calender_icon.png 20 February, 2026 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెక్యూరిటీ టెండర్లలో నిబంధనల ఉల్లంఘన

20-02-2026 03:47:53 PM

- సిపిఐ మందమర్రి పట్టణ కార్యదర్శి దుర్గ రాజ్

మందమర్రి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో 90 మంది అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుల కేటాయింపు కోసం నిర్వహించిన టెండర్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని సిపిఐ పట్టణ కార్యదర్శి కామెరా దుర్గ రాజ్ శుక్ర వారం ఆరోపించారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అర్హత లేని సంస్థలకు టెండర్లు కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మీ మాధవ్ సెక్యూరిటీ సర్వీస్, తిరంగ సెక్యూరిటీ అండ్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ సంస్థలకు సరైన ధృవీకరణ పత్రాలు లేవని పేర్కొన్నారు.

అధికార పార్టీకి చెందిన మంత్రులు, నేతల అండతో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫైళ్లను వేగంగా కదిలిస్తున్నారని మండిపడ్డారు. ఎల్1 కాంట్రాక్టర్ టెండర్ డ్రా పద్ధతిలో ఎంపికైన తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ కు చెందిన పసరా (PASARA) లైసెన్స్ ను ఒక్క రోజులోనే సృష్టించి సమర్పించారన్నారు. వర్క్ ఆర్డర్ తేదీలు, జిఎస్టి వివరాలు పొంతన లేకుండా ఉన్నాయని, ఈఎస్ఐ, పిఎఫ్ బిల్లులు, బ్యాంక్ స్టేట్మెంట్లను నిశితంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు.