22 July, 2026 | 8:24 PM

వర్షాకాల వ్యాధులపై అప్రమత్తత

22-07-2026 07:46 PM

వాంకిడి,(విజయక్రాంతి): సార్వత్రిక రోగ నిరోధకత (యూఐపీ) కార్యక్రమంలో భాగంగా వాంకిడి మండలంలోని కనర్గామ్ గ్రామంలో బుధవారం టీకాలపై అవగాహన కార్యక్రమంతో పాటు రాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించారు. చిన్నారులు, గర్భిణులకు టీకాల ప్రాధాన్యతను వివరించిన వైద్య సిబ్బంది, గర్భిణులు మూడు నెలల్లోపు గర్భధారణను నమోదు చేసుకుని ప్రతి నెలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

అనంతరం ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. దోమలు వృద్ధి చెందకుండా వారానికి ఒకసారి నీటి తొట్టెలు, డ్రమ్ములు శుభ్రం చేయాలని సూచించారు. వైద్య శిబిరంలో 46 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, జ్వర లక్షణాలు ఉన్న ఇద్దరి నుంచి రక్త నమూనాలు సేకరించి మందులు పంపిణీ చేశారు.