calender_icon.png 20 February, 2026 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనారోగ్య మహిళకు సీఎం సహాయ నిధి

20-02-2026 04:03:08 PM

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్

సనత్‌నగర్,(విజయక్రాంతి): అనారోగ్యానికి గురైన మహిళకు మెరుగైన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. సనత్ నగర్ లోని బికె గూడకు చెందిన బొడ్డు స్వప్న నరాల సంబంధ సమస్యతో కొద్దికాలంగా బాధపడుతున్నది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆమె భర్త శ్రీకాంత్ గౌడ్ మెరుగైన వైద్యం చేయించలేకపోయారు.

తన భార్య చికిత్స కోసం సహాయం అందించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శ్రీకాంత్ గౌడ్ ఆశ్రయించి కోరారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మంజూరైంది. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీకాంత్ గౌడ్ కు ఆర్ధిక సహాయం మంజూరు పత్రాన్ని అందజేశారు.