22 July, 2026 | 9:48 PM

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం

22-07-2026 08:44 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, ప్రతిపక్షాల గొంతు నొక్కే చర్యలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాలని, "విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి" అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు.