రామాలయానికి ఆటోమేటిక్ టెంపుల్ బెల్ టైమర్ విరాళం
22-07-2026 08:37 PM
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని రామాలయానికి బుధవారం గ్రామానికి చెందిన ఇరువురు అన్నదమ్ములు రామాయి నారాయణ కుమారులైన రామాయి ప్రసాద్ రణధీర్లు. బుధవారం రామాలయానికి ఆటోమేటిక్ టెంపుల్ బిల్లు అందించారు. ఇందులో వారానికి ఒక దేవుని భక్తి గీతాలు రావడం జరుగుతుందని దాతలు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ సుభ సూర్య వి డి సి మాజీ అధ్యక్షులు కానీ మురళి చేతుల మీదుగా స్వీకరించడం జరిగింది.






