3 June, 2026 | 2:07 AM

మట్టి రవాణా చేస్తున్న టిప్పర్ లారీలను అడ్డుకొన్న గ్రామస్థులు

03-06-2026 12:43 AM

సుల్తానాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కోదురుపాక గ్రామంలోని ఎల్లమ్మ చెరువు నుండి టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తుండగా ఎలిగేడు మండలం ముప్పిరీ తోట  గ్రామం వద్ద గ్రామస్తులు టిప్పర్ లారీలను మంగళవారం అడ్డుకున్నారు, రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి రోజూ వందలాది పెద్ద పెద్ద లారీలు అధిక లోడుతో మా గ్రామాల నుండి ప్రయాణిస్తుంటే రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయని గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేశారు,

అందుకే మా గ్రామల నుండి మట్టి లారీ లు వెళ్ళడానికి విల్లెదని  గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు, అధికలోడు తో వెళ్తున్నా లారీలను ఆర్టిఓ అధికారులు కానీ , మైనింగ్ అధికారులు కానీ ఎవరు కూడా పర్యవేక్షితలేరని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు, ఎన్ని సార్లు అధికారుల కు విన్నవించినా పలితం లేదని అందుకే లారీలను అడ్డుకుంటున్నామని అన్నారు, ఇప్పటికైనా ఓవర్  లోడుతో వెళ్తున్న లారీలను మా గ్రామం నుండి నడపవద్దని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు...