3 June, 2026 | 2:56 AM

నార్ముల్ (మదర్ డెయిరీ) ఎండీగా కోదండపాణి..- ప్రస్తుత ఎండీ లింగారెడ్డికి సీఈవోగా బాధ్యతలు

03-06-2026 12:43 AM

అభినందించిన నార్ముల్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి 

ఎల్బీనగర్, జూన్ 2 : హయత్ నగర్ లోని నార్ముల్ (మదర్ డెయిరీ) సంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా కోదండ పాణిని నియమిస్తూ ఎన్డీడీబీ చెర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఇప్పటివరకు ఎన్డీడీబీలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తుండగా... మంగళవారం హయత్ నగర్ లోని నార్ముల్ (మదర్ డెయిరీ) ప్రధాన కార్యాలయంలో ఎండీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎన్డీడీబీతో ఒప్పందంలో భాగంగా గత నెల 23 నుంచి నార్ముల్ (మదర్ డెయిరీ)లో ఎన్డీడీబీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

కాగా, నార్ముల్ (మదర్ డెయిరీ) చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఎండీగా బాధ్యతలు స్వీకరించిన కోదండపాణికి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు ఎండీగా పనిచేసిన కాటిపల్లి లింగారెడ్డిని  సీఈవోగా నియమిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఈ సందర్భంగా చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.... పదేళ్లుగా నష్టాలలో కొనసాగుతున్న నార్ముల్ సంస్థను ఏడాదిలో లాభాల బాటలోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని, ఇందుౠ ఉద్యోగులు సహకరించాలని కోరారు. ఎన్డీడీబీ ఒప్పందంలో నార్ముల్ మదర్ డెయిరీ తరపున విశేషంగా కృషిచేసిన ఉద్యోగి సామ మహిపాల్ రెడ్డి ని చైర్మన్ ప్రత్యేకంగా అభినందిస్తూ సత్కరించారు. ఎండీ కోదండ పాణి మాట్లాడుతూ... తాను ఉద్యోగుల పక్షపాతిని అని, ఉద్యోగులంతా నిబద్దతతో పనిచేసి సంస్థ అభివృద్ధికి తొడ్పాటు అందించాలన్నారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు కర్నాటి జయశ్రీ ఉప్పల్ వెంకట్ రెడ్డి, పుప్పాల నర్సింహులు, ఎండీఐఎల్ ప్రతినిధి వైవీ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.