14-02-2026 01:38:13 AM
వేములవాడ 21వ వార్డులో నరాల శేఖర్ హ్యాట్రిక్ విజయం
వేములవాడ, ఫిబ్రవరి 13,(విజయక్రాంతి)వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో 21వ వార్డు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. స్థానిక ప్రజల అభిరుచులు, వార్డు పరిస్థితులపై ముందుగానే అంచనా వేసిన విజయక్రాంతి జాతీయ తెలుగు దినపత్రిక అంచనాలు నిజమవుతూ, బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి నరాల శేఖర్ మూడోసారి కౌన్సిలర్గా ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 462 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడం ఆయన ప్రజా దరణకు నిదర్శనంగా నిలిచింది.
సేవలతోనే నమ్మకాన్ని గెలుచుకున్న శేఖర్
నరాల శేఖర్ రాజకీయ ప్రయాణం ప్రజలతో మమేకమవుతూ సాగింది. ముందుగా ఆయన సతీమణి సౌజన్య వార్డు కౌన్సిలర్గా పనిచేసి ప్రజలకు చేరువయ్యారు.అనంతరం శేఖర్ స్వయంగా కౌన్సిలర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ కాలంలో వార్డులో మౌళిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు,సీసీ కెమెరాల ఏర్పాటు, ఇంటింటికీ మొక్కల పంపిణీ, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో చొరవ చూపించారు.
అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులై న ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయడం,గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఆయనకు ప్రజల్లో ప్రత్యేక గుర్తిం పునిచ్చాయి. సామాజిక సేవా కార్యక్రమాలు, అవసరమైన వారికి ఆర్థిక సహా యం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం వం టి కార్యక్రమాల ద్వారా ప్రజలతో అనుబంధాన్ని మరింత బలపరిచారు.
ప్రజల స్పష్టమైన తీర్పు
ఎన్నికల ప్రచారం సమయంలోనే వార్డు ప్రజల అభిప్రాయాలు నరాల శేఖర్కు అనుకూలంగా ఉన్నట్లు కనిపించాయి. అదే విష యాన్ని విజయక్రాంతి దినపత్రిక తన విశ్లేషణలో ముందుగానే పేర్కొనడం విశేషం. ఫలితాలు వెలువడిన రోజు ఆ అంచనాలు నిజమవడంతో పత్రిక విశ్లేషణపై చర్చ సాగింది.
సంబరాల్లో మునిగిన వార్డు ప్రజలు
శేఖర్ విజయం నేపథ్యంలో 21వ వార్డు పండుగ వాతావరణాన్ని తలపించింది. మ ద్దతుదారులు, స్థానికులు మిఠాయిలు పం చుతూ హర్షం వ్యక్తం చేశారు. పలువురు యువకులు టపాసులు కాలుస్తూ సంబరా లు జరిపారు. మహిళలు, వృద్ధులు శేఖర్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనపై తమ నమ్మకాన్ని మరోసారి వ్యక్తం చేశారు.
శేఖర్ ముందున్న సవాళ్లు
హ్యాట్రిక్ విజయం సాధించిన నరాల శేఖర్కు ఇప్పుడు ప్రజల అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ధి పనులను పూర్తిచేయడం,కొత్త సమ స్యల పరిష్కారం, యువతకు ఉపాధి అవకాశాలపై దృష్టి సారించడం వంటి అంశాలు ఆయన ముందున్న ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయి.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుం టూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతానని నరాల శేఖర్ పేర్కొనడం గమనార్హం.ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ తన గెలుపులో భాగస్వామ్యులైన వార్డులోని ప్రతి ఓటరుకు పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.