14-02-2026 01:39:38 AM
అడ్డాకుల ఫిబ్రవరి 13 పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని అడ్డాకుల సర్పంచ్ దశరథ్ రెడ్డి పేర్కొన్నారు. అడ్డాకుల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ దశరథ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పంచాయతీ కార్యదర్శి సరస్వతి ముగ్గు పోశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దశరథరెడ్డి, జిల్లా కార్యదర్శి విజయ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో మోసం చేసిందని ఆరోపించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంక దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారని అన్నారు ప్రతి పేదోడు ఇల్లు నిర్మించుకుంటూ ఆనందంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సరస్వతి, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ రెడ్డి, వేగా నాథ్ రవీందర్ రెడ్డి, గ్రామస్తులు తదులు పాల్గొన్నారు