విజయక్రాంతి కథనానికి స్పందన..రోడ్డుపై బురద తొలగింపు
విజయక్రాంతి వార్తకు స్పందించిన అధికార యంత్రంగం
బోథ్. ఆగస్టు 25 (విజయక్రాంతి): ప్రజల సమస్యలపై గలం విప్పుతున్న విజయక్రాంతికి అధికారుల నుంచి మంచి స్పందన వచ్చింది. బురద మట్టితో కూడుకున్న రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. బోథ్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పాత కోర్టు రోడ్డు పైన రెండు రోజుల క్రితం గ్రామపంచాయతీ వారు మొరం పోశారు. దీంతో వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారి ఆ రూట్లో ప్రయాణించే ద్విచక్ర వాహనాల వారితో పాటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. ఈ విషయంపై విజయక్రాంతిలో ప్రచురితమైన ‘‘మొరం పోశారు బురదమయంగామార్చారు.. అనే వార్తకు అధికారులు వెంటనే స్పందించారు. పంచాయతీ వారు సకాలంలో స్పందించి..సమస్యను తీర్చడంతో పలువురు వర్షం వ్యక్త చేస్తూ.. అలాగే విజయక్రాంతికి ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 






