25 August, 2026 | 1:32 PM

ఈనెల 27న టిజిజెఎసి మహా ధర్నా

25-08-2026 12:40 PM

ముకరంపుర, ఆగస్టు 25(విజయ క్రాంతి): టిజిజెఎసి పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో ఈనెల 27న తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్టీయు స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ సానా కిషన్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కేంద్రంలో సానా కిషన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక తీరు వచ్చిన తర్వాత ఒక తీరు ప్రదర్శిస్తుందని దీనికి నిరసనగా ఈనెల 27వ తేదీన జిల్లా కేంద్రంలో టిజిఇ జేఏసీ పిలుపుమేరకు మన హక్కులైన రెండవ పిఆర్సి,  పెండింగ్ డిఏ, మరియు పెండింగ్ బకాయిలను సాధించడం కోసం మహా ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.కావున ఉద్యోగ, ఉపాధ్యాయులు అందరూ పెద్ద సంఖ్యలో హాజరై ఈ మహా ధర్నాను విజయవంతం చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా చేయాలని  కోరారు.