పర్ది( కే )లో వన మహోత్సవం
25-08-2026 12:47 PM
బోథ్. ఆగస్టు 25 (విజయక్రాంతి): సోనాల మండలంలోని పార్టీ ( కె) గ్రామంలో మంగళవారం ఎంపీడీవో రత్నాకర్ రావు సమక్షంలో వనమా ఉత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు మొక్కలను నాటారు. నాటిన ప్రతి మొక్కను బ్రతికించుకోవాలని ఎంపీడీవో రత్నాకర్ రావు సూచించారు. అన్ని గ్రామాలలో మొక్కలు నాటాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ కార్యదర్శి పాల్గొన్నారు.






