ఇందిరమ్మ ఇళ్ల అర్హల తుది జాబితా విడుదల..ఇలా చెక్ చేసుకోండి..!
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల అర్హల తుది జాబితా విడుదల
క్యూర్ పరిధిలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 60,720 మంది
tghb.telangana.gov.in వెబ్ సైట్ లో వివరాలు లభ్యం
కాల్ సెంటర్ 040-24603572ను సంప్రదించాలన్న హౌసింగ్ బోర్డు వీసీ
హైదరాబాద్ ఆగస్టు 25(విజయక్రాంతి): హైదరాబాద్ క్యూఆర్‌లో ఇందిరమ్మ ఇళ్లు తుది అర్హుల జాబితా విడుదల హైదరాబాద్ క్యూఆర్ (CURE) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గూడ్ న్యూస్ చెప్పంది. లాటరీకి అర్హత సాధించిన దరఖాస్తుదారుల తుది జాబితాను ఆగస్టు 25న హౌసింగ్ బోర్డు వెల్లడించింది. అర్హులైన లబ్ధిదారులకు ఆగస్టు 27 నుంచి 30వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా లాటరీ నిర్వహించి ఇళ్లను కేటాయించనున్నారు.
క్యూఆర్ పరిధిలోని 16 నియోజకవర్గాల నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 60,720 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలనలో భాగంగా అభ్యర్థుల ఇళ్లు, స్థలాలు, ఆస్తులు, వాహనాలు తదితర వివరాలను అధికారులు తనిఖీ చేశారు. ప్రాథమిక పరిశీలన అనంతరం అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు జారీ చేసి, అభ్యంతరాలు స్వీకరించారు.
అర్హతను ఇలా చెక్ చేసుకోండి
దరఖాస్తుదారులు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ద్వారా వివరాలను పరిశీలించే అవకాశం ఉంది. స్టేటస్‌లో ‘Eligible’ లేదా ‘Ineligible’ అనే వివరాలు కనిపిస్తాయి. అనర్హతగా చూపించిన దరఖాస్తుదారులు ‘Raise Claim’ ఆప్షన్ ద్వారా తమ అభ్యంతరాలను నమోదు చేసి, అవసరమైన ఆధారాలను సమర్పించే అవకాశం కల్పించారు.
ఆగస్టు 27 నుంచి లాటరీ
తుది జాబితాలో చోటు దక్కిన అర్హులైన దరఖాస్తుదారులకు ఆగస్టు 27 నుంచి 30 వరకు లాటరీ నిర్వహించనున్నారు. లాటరీలో ఎంపికైన వారికి ఇందిరమ్మ ఫ్లాట్లను కేటాయించనున్నారు. ఈ ప్రక్రియను నియోజకవర్గాల వారీగా చేపట్టనున్నారు.ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు, అర్హత, లాటరీ ప్రక్రియకు సంబంధించి సందేహాలుంటే 040-24603572 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.






