25 April, 2026 | 6:55 AM

వాసవీ మాత జయంతి ఉత్సవాల కరపత్రాలు ఆవిష్కరించిన విజయ రమణారావు

25-04-2026 01:25 AM

సుల్తానాబాద్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వాసవి మాత దేవాలయంలో ఈ నెల 26న జరుగు జయంతి ఉత్సవ వేడుకలకు సంబంధించి శుక్రవారం తెలంగాణ రా ష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణా రావు కరపత్రాలను ఆవిష్కరించారు.,

అలాగే వాసవి మాత జయంతి ఉత్సవాలు ప్రభుత్వపరంగా నిర్వహించేందుకు గాను జీవో జారీ చేసినందు కు ఆర్యవైశ్యులందరం  కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ప్రభుత్వ విప్పుగా నియామకమైన సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో  ఎమ్మెల్యే విజయరమణారావు కు  కృతజ్ఞతలు తెలిపి. ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.