15 July, 2026 | 6:48 PM

ఖమ్మంకు.. బండి ఆశీర్వాదం

15-07-2026 06:27 PM

కోహెడ: సిద్దిపేట బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన కోహెడకు చెందిన ఖమ్మం వేంకటేశం బుధవారం కరీంనగర్ లో కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ ని మర్యాద పూర్వకంగా కలిసినట్లు పేర్కొన్నారు. శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మండలాధ్యక్షుడు జాలిగం రమేష్ పాల్గొన్నారు.