15 July, 2026 | 6:33 PM

తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయాలి

15-07-2026 06:18 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ప్రస్తుత వ్యవసాయ సీజన్లో రైతులు తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయాలని జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్ కోరారు.జగన్నాధపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ కుంజా వినోద్, వ్యవసాయ విస్తరణ అధికారి బి.రమేష్ రైతులకు ముఖ్య సూచనలు చేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది ఎల్ నీనో ప్రభావం కారణంగా సాధారణం కంటే వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అనంతరం  స్థానికంగా ఉన్న ఎరువుల దుకాణం సందర్శించి వాతావరణ శాఖ అధికారుల సూచనలతో నాణ్యమైన విత్తనాలు,ఎరువులు అందించాలని వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసేలా రైతులను చైతన్య పరచాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మండల బి ఎల్ ఎ కోఆర్డినేటర్ సురభి రాజేష్,రైతులు పాల్గొన్నారు.