15 July, 2026 | 7:08 PM

సోనాల మండల కేంద్రంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

15-07-2026 06:44 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాజర్షి సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం 10 గంటలకు మండల కేంద్రానికి చేరుకున్న కలెక్టర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అక్కడే నూట్రి గార్డెన్, గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామపంచాయతీలో ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి బిఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ అమలుతీరును పరిశీలించడంతోపాటు పలు సూచనలు చేశారు.

అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలించి, అందులో ఉన్న రోగులకు అవసరమైన టాబ్లెట్లను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. హెల్త్ సెంటర్ను వెంటనే ప్రారంభించాలని సూచించారు. అనంతరం ఫర్టిలైజర్ ల గోదాములను పరిశీలించి రైతులకు అందజేస్తున్న ఎరువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేగాక యాప్ పనితీరు గురించి వివరంగా తెలిపారు. కలెక్టర్ వెంట గ్రామ సర్పంచ్ బిందుజ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ తుల శ్రీకాంత్, వార్డు సభ్యులు హరీష్, మృణాలగౌడ్, పంచాక్షరి తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై తీసుకుంటున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తపరిచారు.