15 July, 2026 | 6:31 PM

నగరంలో రూ.1.5 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనులకు శంకుస్థాపన

15-07-2026 06:21 PM

ముకరంపుర,(విజయ క్రాంతి): నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్ నగరంలోని 47వ, 62వ డివిజన్లలో యుఐడిఎఫ్ నిధుల ద్వారా చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ  బండి సంజయ్ కుమార్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తో కలిసి శంకుస్థాపన చేశారు.ముందుగా 47వ డివిజన్ రామ్‌నగర్‌ లోని సిద్ధార్థ స్కూల్ సమీపంలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు.

ఈ పనులు పూర్తయిన తర్వాత స్థానిక ప్రజలకు మెరుగైన రహదారి, పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం 62వ డివిజన్‌ లో శ్రీరామ బుక్ స్టాల్,ఆకుల శైలజ హాస్పిటల్ సమీపంలో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, నగరంలో నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.