20న సింగరేణి అద్దె వాహనాల టెండర్ల డ్రా
ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలో వివిధ గనులు, విభాగాల అవసరాల కోసం ఆహ్వానించిన 9 అద్దె వాహనాల టెండర్ల డ్రా ఈ నెల 20న నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో డ్రా కార్యక్రమం జరుగుతుందని ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్వాలిటీ విభాగం, కోయగూడెం ఓపెన్‌కాస్ట్, జేకే ఓపెన్‌కాస్ట్, సర్వే, ఈ&యం తదితర విభాగాల అవసరాల కోసం మొత్తం 9 అద్దె వాహనాల నిర్వహణకు టెండర్లు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
నిర్ణీత గడువులో అందిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా డ్రా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డ్రా ప్రక్రియను టెండర్ దరఖాస్తుదారులు ప్రత్యక్షంగా వీక్షించవచ్చని, ఆసక్తి గల దరఖాస్తుదారులు ఈ నెల 20న మధ్యాహ్నం 3 గంటలకు ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయానికి హాజరుకావాలని ఏరియా జీఎం వి. కృష్ణయ్య కోరారు.






