అశ్వరావుపేటలో ఎస్ఐఆర్ ప్రత్యేక ఎన్నికల కార్యక్రమం నిర్వహణ
15-07-2026 06:37 PM
అశ్వరావుపేట,(విజయక్రాంతి): SIR ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బుధవారం అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని బిఎస్ఆర్ నగర్లో నిర్వహించిన ఎస్ఐఆర్ ఎన్నికల కార్యక్రమానికి అశ్వరావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జూపల్లి రమేష్ మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుని బాధ్యత అని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ దరఖాస్తును పూర్తి చేసి అధికారులకు అందజేయాలని కోరారు. అప్లికేషన్ ఫారాలు తీసుకోని వారు స్థానిక ప్రజాప్రతినిధులు లేదా సంబంధిత బూత్ లెవల్ అధికారులను సంప్రదించి ఫారాలను పొందాలని సూచించారు.






