ట్రిపుల్ ఐటీ డీఎస్పీగా వెంకట రామయ్య
30-06-2026 12:21 AM
భైంసా (విజయక్రాంతి) : బాసర ట్రిపుల్ ఐటి డిఎస్పీగా వెంకట నరసయ్యను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల బాసర త్రిబుల్ ఐటీ లో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో శాంతి పద్ధతుల పర్యవేక్షణ లక్ష్యంగా రెగ్యులర్ డిఎస్పిని ప్రభుత్వం నియమించడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇన్చార్జి డిఎస్పి తో బాసర త్రిబుల్ ఐటీ శాంతి భద్రత పరిరక్షణ కొనసాగించారు.






