30 June, 2026 | 2:54 AM

ఎంపీ క్యాంప్ ఆఫీస్ ప్రారంభం

30-06-2026 02:00 AM

నల్లగొండ టౌన్, జూన్ 29: నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్ లో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి క్యాంపు కార్యాలయంను సోమవారం ప్రారంభించారు. సుదీర్ఘకాలం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సభ అనంతరం జిల్లా కేంద్రంలో ఎంపీ తన క్యాంపు కార్యాలయం ప్రారంభించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయంగా అంతర్గత పోరు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డితో కలిసి క్యాంపు కార్యాలయం ప్రారంభించడం రాజకీయంగా చర్చలకు దారి తీసింది.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవర్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరీ రమేష్, నల్లగొండ, కనగల్ మాజీ జెడ్పిటిసిలు వంగూరు లక్ష్మయ్య, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.