8 May, 2026 | 2:49 AM

వరి సేకరణకు వాహనాలు అందుబాటులో ఉంచాలి

08-05-2026 12:00 AM

అధికారులకు రవాణాశాఖ ఆదేశం

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తం గా వరిధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవం తం చేసేందుకు, రవాణాలో ఎలాంటి అడ్డంకులు కలగకుండా చూసేందుకు రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తీ ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ సప్లుసై విభాగం విజ్ఞప్తి మేరకు జిల్లా అధికార యంత్రాంగం సమన్వ యం చేసుకుంటూ ధాన్యం తరలింపునకు అవసరమై న వాహనాలను సిద్ధం చేయాలని రవాణా అధికారులను ఆదేశించారు.

ధాన్యం సేకరణ కేంద్రాల నుంచి నిల్వ కేంద్రాలు, రైస్ మిల్లులకు రవాణా సాఫీగా సాగేందుకు తగినన్ని సరుకు రవాణా వాహనాలు  అందుబాటులో ఉంచాలన్నారు.  వాహనాల కేటాయింపు, తరలింపు లో ఎలాంటి జాప్యం జరగకుండా  కలెక్టర్లు, సివిల్ సప్లుసై అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. వాహనాల కదలికలో ఏవైనా సమస్యలు ఎదురైతే జిల్లా అధికారుల సా యంతో తక్షణమే పరిష్కరించాలని పేర్కొన్నారు.