8 May, 2026 | 1:57 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

08-05-2026 12:00 AM

మేడ్చల్, మే 7 (విజయక్రాంతి): రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే విక్రయించుకోవాలని, ఈ కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభించడంతో పాటు దళారుల బెడద ఉండదని, పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. గురువారం శామీర్ పేట్, అలియాబాద్, జగన్ గూడ, కేశవరం, లక్ష్మపూర్ లోని రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.... రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే విక్రయించుకోవాలని, ఈ కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభించడంతో పాటు దళారుల బెడద ఉండదని, పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, మున్సిపాలిటీ చైర్మన్లు జాము రవి, శిరీష కృష్ణారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు , సహకార సంఘం డైరెక్టర్లు, రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.