పినపాక మండల పరిధిలోవాహనాల తనిఖీ
22-08-2026 01:09 AM
పినపాక, ఆగస్టు 21, (విజయక్రాంతి): పినపాక మండల పరిధిలోని ఎడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద ఎస్‌ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ మార్గంలో వెళ్తున్న వాహనాలను నిలిపి రికార్డులను, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సురేష్ మాట్లాడుతూ... అక్రమ రవాణాను అరికట్టేందుకే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ సహా అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






