జన్మదినాన్ని సేవాదినంగా మార్చిన వాసు
పుట్టినరోజుకు రెండు చేతి పంపులు ఏర్పాటుచేసిన కొండపల్లి
కల్లూరు,జూలై 25(విజయక్రాంతి): కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం గ్రామ పంచాయితీలో మాజీ ఎంపీటీసీ కొండపల్లి శ్రీనివాసరావు (వాసు) జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా సేవాదినంగా మార్చుకొని స్థానిక సర్పంచ్ బేబీ స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామంలోని ముత్యాలమ్మ గుడి వద్ద ఒక చేతి పంపు,మెయిన్ రోడ్డులోని రామాలయం వద్ద మరో చేతి పంపును సొంత నిధులతో ఏర్పాటు చేయించారు.గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ రెండు చేతిపంపులను ఏర్పాటు చేయడం విశేషం.స్థానిక ప్రజలు వాసు సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముగ్గు వెంకటాపురం సర్పంచ్ బేబీ స్వరాజ్యలక్ష్మి,నానాజీ,సీనియర్ నాయకులు కొండపల్లి రాధాకృష్ణ,గ్రామ పెద్దలు,కొండపల్లి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






