27 April, 2026 | 3:20 AM

ఘనంగా వాసవీ మాత జయంతి

27-04-2026 12:00 AM

నిర్మల్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి) : కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆదివారం వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ముందుగా ఆయన పలువురు అధికారులు, సంఘాల నాయకులతో కలిసి వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ జయంతి వేడుకలలో డివైఎస్‌ఓ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, సంఘ నాయకులు పాల్గొన్నారు.

న్యాయానికి ప్రతీక వాసవి మాత జిల్లా ఎస్పీ జానకి షర్మిల 

శాంతి ధర్మం న్యాయానికి ప్రత్యేక వాసవి మాత అని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో వాసవి మాత జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. మోతా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

శాంతి, ధర్మం, త్యాగా నికి ప్రతీకగా నిలిచిన వాసవి మాత మహత్తర జీవితాన్ని స్మరించుకునే రోజు ఈరోజు అని తెలిపారు. వాసవి మాత చూపిన మార్గం సమాజానికి ఆదర్శమని, ధర్మం, న్యాయం కోసం జీవించాలనే సందేశాన్ని అందరికీ ఇస్తుందని జిల్లా పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.