27 April, 2026 | 2:46 AM

ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ మాత

27-04-2026 12:55 AM

కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వాసవి మాత జయంతి ఉత్సవాలను మెదక్ కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఆదివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వాసవి మాత జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మండల ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన  గావించి వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్  నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె  మాటాడుతూ, జిల్లా యువజన, క్రీడల శాఖ  ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష దశమి నాడు వాసవి మాతా జయంతి ఉత్సవాలను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సందర్బంగా వాసవి మాత జయంతిని జరుపుకోవడం  సంతోషదాయకమని పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల కులదేవతగా వాసవి మాతకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు, ఆర్యవైశ్య సంఘం నాయకులు చంద్రపాల్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పల్లెర్ల రవీందర్, ప్రధాన కార్యదర్శి బుక్క అశోక్, కోషధికారి మరుమల్ల అశోక్, ఆర్యవైశ్య సంఘం ఉత్సవ కమిటీ చైర్మన్ రాయ కంటి నాగరాజు, ఆర్యవైశ్య సంఘం మేడం బాలకృష్ణ, రాగి అశోక్, పట్టణ కార్యదర్శి బచ్చు పార్థివనాథ్, ఉప్పల శ్రీకాంత్, కోవురి శ్రీనివాస్, షిర్నా రాజేశ్వర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు చంద్రపాల్, వుట్కురి వీరేశం, కౌన్సిలర్ శివరామకృష్ణ , కొండా శ్రీనివాస్, పురం వెంకట నారాయణ, కొమ్మ వెంకటేష్, బజ్జూరి బిక్షపతి, మురళి, పొగాకు రామకృష్ణ,  వనజ, సుష్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.