27 April, 2026 | 2:45 AM

గుమ్మడిదలలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రగడ

27-04-2026 12:54 AM

వ్యక్తిగత ఆరోపణలతో సై అంటే సై

ప్రజాక్షేత్రంలో చులకన అవుతున్న నాయకులు

గుమ్మడిదల, ఏప్రిల్ 26 : గుమ్మడిదల మండలంలో గత రెండు రోజుల నుండి రాజకీయ నాయకులలో వేడి సెగ మొదలైంది. అటు బిఆర్‌ఎస్ నాయకుడు, ఇటు కాంగ్రెస్ నాయకుడు దేనికైనా సై అంటే సై అని సవాల్ విసురుతున్నారు.

ఒకవైపు బిఆర్‌ఎస్ నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి బహిరంగంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో మా తండ్రి సర్పంచ్ గా ఉన్నప్పుడు 50 లక్షల స్కామ్ జరిగిందని ఆరోపించారని దానిని నిరూపించాలని, అలాగే 13వ వార్డు నుండి గెలిచిన నరేందర్ రెడ్డిని రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్లు జరిపితే నేను కాదు మా కార్యకర్తను నిలబెట్టి గెలిపిస్తానని సవాల్ చేశారు.

దీంతో 13వ వార్డు కౌన్సిలర్ మూడు చింతల నరేందర్ రెడ్డి  మాట్లాడుతూ బై ఎలక్షన్ ఎందుకు గత ఎన్నికల్లో పోటీగా ఉన్నది మీ కార్యకర్త కాదా మరి అప్పుడు ఎందుకు గెలవలేదని, ఇప్పుడు రాజీనామా చేసి బై ఎలక్షన్ అంటున్నారని, అయినా సరే తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.

సోమవారం కమిషనర్ కు తన రాజీనామా పత్రాన్ని అందిస్తానని, దమ్ముంటే గోవర్ధన్ రెడ్డి సతీమణి సంధ్య రెడ్డిని కూడా రాజీనామా చేయించాలని, దేనికైనా నేను రెడీ అంటూ నరేందర్రెడ్డి సవాల్ విసిరారు. ఇలా విమర్శ, ప్రతివిమర్శలు, సవాళ్ళు చేసుకుంటూ రాజకీయ విబేధాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ప్రజల విశ్వాసాన్ని చూరగొనాల్సిన నాయకులే బహిరంగంగా స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. రాజకీయాలు పక్కనబెట్టి అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాల్సిన నేతలే వ్యక్తిగత రాజకీయాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.