ఏఎస్‌రావునగర్‌లో ‘వాసన్ ఐ కేర్’
నూతన కేంద్రం ప్రారంభం
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ఏఎస్జీ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన వాసన్ ఐ కేర్ హాస్పిటల్ నూతన నేత్ర వైద్య కేంద్రాన్ని హైదరాబాద్‌లోని ఏఎస్‌రావునగర్‌లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు నెల రోజుల పాటు అందిస్తున్న ఉచిత కంటి పరీక్షల సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అత్యాధునిక నేత్ర వైద్య సేవలు ప్రజలకు వారి ప్రాంతంలోనే అందుబాటులోకి రావడం అభినందనీయమని అన్నారు.
సీనియర్ ఫాకో రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ సుధీర్ చిమకుర్తి, క్యాటరాక్ట్ అండ్ విట్రియో-రెటీనా సర్జన్ డాక్టర్ సంకేత్ సింగ్ రాథోడ్, డాక్టర్ ప్రమోద్ కుమార్ (ఎంబీబీఎస్, డీవో, డీఎన్‌బీ), న్యూరో-ఆప్తాల్మాలజీ, పీడియాట్రిక్ అండ్ స్క్వింట్ సర్జన్ డాక్టర్ అమీషా బుధిరాజా, ఆక్యులోప్లాస్టీ సర్జన్ డాక్టర్ మనోజ్ ఫులారి మాట్లాడుతూ.. కొత్త కేంద్రంలో క్యాటరాక్ట్, గ్లాకోమా, రెటీనా, కార్నియా, చిన్నారుల నేత్ర వైద్యం, మధుమేహ సంబంధిత నేత్ర సమస్యలకు అత్యా ధునిక నిర్ధారణ, చికిత్స, శస్త్రచికిత్స సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.






