యాదగిరిగుట్టలో వరుణ యాగం
22-07-2026 12:14 AM
రెండో రోజు కొనసాగిన పూజలు
యాదగిరిగుట్ట, జూలై 21 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో రెండవ రోజైన మంగళవారం వర్ష పాశుపత వరుణ యా గం పూజారులు నిర్వహించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి పాడి, పంటలకు కొరత లేకుండా పకృతి సస్యశ్యామలంగా తులతూగాలని ఆకాంక్షిస్తూ పూజలు చేపట్టారు.
ఆలయంలో ఉదయం పండితుల వేద మంత్రపఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ మండపారాధన లు, కలశస్థాపన, ఋష్యశృంగ విగ్రహస్థాపన, జపములు, పారాయణములు, అగ్నిప్రతిష్ఠ, పూర్వాంగ విదులు తదితర పూజలు నిర్వహించారు. ఈ యా గంలో ఆలయ ఈవో భవాని శంకర్ పాల్గొన్నారు.






